అమెరికాలోని తెలుగు సమాజానికి సేవలందిస్తున్న మన అమెరికా తెలుగు సంఘం (MATA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ‘మాటా రెండవ మహాసభలు – 2026’ జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా జరగనున్నాయి. ఈ మహాసభల్లో భాగంగా జూన్ 20వ తేదీ శనివారం ప్రత్యేకంగా బిజినెస్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

“Entrepreneurship Without Limits – Building Vision, Wealth & Legacy” అనే ప్రధాన అంశంతో జరుగనున్న ఈ ఫోరమ్‌లో వ్యాపార, సాంకేతిక, పెట్టుబడి రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి (నోబెల్ బహుమతి నామినీ, రచయిత, పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు) మరియు జేమ్స్ బారూడ్ (ఇన్నోవేట్ 100 వ్యవస్థాపకుడు, టెడెక్స్ స్పీకర్, ఇన్నోవేటర్) ముఖ్య వక్తలుగా హాజరుకానున్నారు.

వ్యాపార రంగంలో విజయానికి అవసరమైన ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ అభివృద్ధి, నాయకత్వ లక్షణాలు, వ్యాపార విస్తరణకు పెట్టుబడుల సమీకరణ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక ఆవిష్కరణలు, సంపద సృష్టి మరియు వారసత్వ నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3:00 గంటల వరకు నిర్వహించనున్న ఈ ఫోరమ్, కొత్త ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచాలనుకునే యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మరియు వ్యాపారవేత్తలకు విలువైన మార్గదర్శక వేదికగా నిలవనుంది.

“Empowering Entrepreneurs – Inspiring Innovation – Transforming Communities” అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు వ్యాపారవేత్తల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు.

WhatsApp Image 2026-06-05 at 7.12.20 AM.jpeg