అమెరికాలోని తెలంగాణ వాసులను ఒక్కచోట చేర్చే లక్ష్యంతో పనిచేస్తున్న షార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) తమ లైఫ్‌టైమ్ సభ్యుల కోసం ప్రత్యేక వార్షిక పిక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. “ఖేలో తెలంగాణ 2026” పేరుతో జరగనున్న ఈ వేడుక జూన్ 7న నార్త్ కరోలినాలోని Waxhaw ప్రాంతంలో నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో వాలంటీర్లు స్వయంగా తయారుచేసే తెలంగాణ వంటకాలు, సంగీతం, డ్యాన్స్ ప్రోగ్రాములు, కుటుంబాల కోసం వినోదాత్మక కార్యక్రమాలు, చిన్నారుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
CTA లైఫ్‌టైమ్ సభ్యులకు ఈ పిక్నిక్ పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా కొత్త సభ్యత్వాల కోసం ప్రత్యేక ఆఫర్‌ను కూడా CTA ప్రకటించింది. సాధారణంగా 200 డాలర్లుగా ఉన్న లైఫ్‌టైమ్ మెంబర్‌షిప్‌ను “ఖేలో తెలంగాణ” ఆఫర్‌లో భాగంగా 150 డాలర్లకే అందిస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు membership@charlottetelangana.org కు Zelle ద్వారా చెల్లించి సభ్యత్వం పొందవచ్చని సూచించారు.
జూన్ 7న ఉదయం 11:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెడ్ బార్న్ ఈవెంట్స్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.














