అమెరికాలోని తెలంగాణ వాసులకు పల్లె సంస్కృతి, సాంప్రదాయ రుచులను గుర్తు చేసేలా గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో “పల్లె వంట” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే ఈ వేడుకను భారీ ఆన్‌సైట్ కుకింగ్ మరియు ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్‌గా రూపొందించారు.

ఈ కార్యక్రమం జూన్ 6, 2026 శనివారం ఉదయం 11:30 గంటల నుంచి అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం ఫార్మింగ్టన్‌లో ఉన్న షియావాసీ పార్క్ (Shiawassee Park)లో జరగనుంది. ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

ఈ వేడుకలో తెలంగాణ ప్రత్యేక వంటకాలను అక్కడికక్కడే తయారు చేసే ఆన్‌సైట్ కుకింగ్ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. గ్రామీణ రుచులను గుర్తు చేసే పల్లె వంటకాల విందుతో పాటు, మహిళలు, పురుషులు, పిల్లల కోసం వినోదాత్మక ఆటలు, బహుమతులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ సంప్రదాయాలను విదేశాల్లోని కొత్త తరానికి పరిచయం చేయడంతో పాటు, తెలుగు కుటుంబాల మధ్య అనుబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని GTA ప్రతినిధులు తెలిపారు.

తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించే ఈ “పల్లె వంట” వేడుకలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.

gta palle vanta flayer.webp