అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం శాన్ ఆంటోనియోలో ఆధ్యాత్మిక వైభవానికి రంగం సిద్ధమైంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న MATA 2nd Convention 2026 సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ మహోత్సవాన్ని ఏకశిల ఫౌండేషన్ USA, స్థానిక స్వచ్ఛంద సేవకుల సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి టెంపుల్ నుంచి అర్చక స్వాములు, ఉత్సవ మూర్తులు ప్రత్యేకంగా విచ్చేసి శాస్త్రోక్తంగా కల్యాణాన్ని జరిపించనున్నారు.

ఈ వేడుక జూన్ 6, 2026 శనివారం ఉదయం 9 గంటలకు, హిందూ టెంపుల్ ఆఫ్ శాన్ ఆంటోనియోలోని మహాలక్ష్మి హాల్‌లో జరుగుతుంది. ఒక్క జంటకు రిజిస్ట్రేషన్ ఫీజు 116 డాలర్లుగా నిర్ణయించారు.

భద్రాచలం సంప్రదాయం ప్రకారం చేతితో దంచిన వరి బియ్యాన్నే కల్యాణ తలంబ్రాలుగా ఉపయోగించడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులు రామనామ స్మరణతో స్వయంగా వలిచిన బియ్యాన్ని తీసుకురావాలని నిర్వాహకులు కోరుతున్నారు. శాన్ ఆంటోనియోలోనే భద్రాచల క్షేత్ర అనుభూతిని అందించే ఈ దివ్య వేడుకకు భక్తులు భారీగా తరలిరానున్నారు.

mata kalyanam flayer.png