అమెరికాలోని అట్లాంటాలో భారతీయ సాంప్రదాయ నృత్య కళ ‘కూచిపూడి’ మహిమను ప్రపంచానికి పరిచయం చేసే ప్రత్యేక ఫోటోగ్రఫీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సవన్నా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (SCAD)లో MFA ఫోటోగ్రఫీ విద్యార్థి అనిరుధ్ ధన్నాయక్ రూపొందించిన ‘నాట్య సంప్రదాయ’ ప్రాజెక్ట్ భారతీయ అమెరికన్ వలస సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు ఎలా తరతరాలకు కొనసాగుతున్నాయో ప్రతిబింబిస్తోంది. కూచిపూడి గురువు శశికళ పెనుమర్తి శిష్యుల సాధన, భావ వ్యక్తీకరణ, భారతీయ వారసత్వాన్ని అనిరుధ్ తన కెమెరాలో ఆవిష్కరించారు.

SCAD MFA Photography Exhibitionలో భాగంగా ఈ ప్రదర్శన మే 22 నుంచి 24 వరకు అట్లాంటాలోని ఎకో కాంటెంపరరీ ఆర్ట్‌లో జరగనుంది. మే 22 సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు జరిగే ప్రారంభ కార్యక్రమంలో ప్రత్యక్ష నృత్య ప్రదర్శనలు, భారతీయ వాతావరణాన్ని ప్రతిబింబించే ప్రత్యేక అలంకరణలు, వీడియో ప్రీమియర్ ఆకట్టుకోనున్నాయి. ప్రవేశం పూర్తిగా ఉచితం కాగా, అనిరుధ్‌కు మద్దతుగా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు. విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి ఎలా జీవించి ఉందో ఈ ప్రదర్శన భావోద్వేగంగా చూపించనుంది.

natya sampradaya.jpg