శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రముఖ ఇసుక శిల్ప కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో అద్భుతమైన సాండ్ ఆర్ట్‌ను రూపొందించారు.బాలకృష్ణుడి చిన్ననాటి అల్లరి, వెన్నదొంగతనం ఘట్టాన్ని ప్రతిబింబించేలా ఈ ఇసుక శిల్పాన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ 101 మట్టి వెన్న కుండలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు.

కృష్ణుడి బాల్యంలోని చిలిపితనం, భక్తి భావాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ కళాఖండం పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పూరీ బీచ్‌కు వచ్చిన సందర్శకులు ఈ అద్భుత ఇసుక శిల్పాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

జన్మాష్టమి వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చిన సుదర్శన్ పట్నాయక్ కళా సృష్టి.. ప్రస్తుతం పూరీ బీచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.