హైదరాబాద్‌లో వినాయక చవితి వేడుకల్లో ఓ గణేశుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బెగంబజార్‌లోని లిచి పెర్ల్ సెట్ జువెల్స్‌లో 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటెడ్ గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఈ విగ్రహం ఏకంగా 3.83 లక్షల అమెరికన్ డైమండ్స్‌తో అలంకరించారు. గణేశుడి వెనుక భాగంలో దశావతారాలను రూపొందించగా.. పైభాగంలో బాలాజీ, ఇరువైపులా లక్ష్మీదేవి, సరస్వతి దేవిని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాన్ని రూపొందించేందుకు 8 మంది కళాకారులు.. 8 నెలల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు. ప్రతి డైమండ్‌ను చేతితో అమర్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
లాల్‌బాగ్‌చా రాజా స్ఫూర్తితో ఈ డిజైన్‌ను రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీతో తమకున్న ప్రత్యేక అనుబంధంతో.. ఈసారి వినాయకుడికి మరింత ప్రత్యేకంగా అలంకరణ చేయాలని భావించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు వెల్లడించారు.














