తాష్కెంట్ విమానాశ్రయంలో అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ.. మిర్జియోయెవ్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు జరపనున్నారు. భారత్–ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.
ట్రేడ్.. ఇన్వెస్ట్‌మెంట్స్.. డిఫెన్స్.. ఎనర్జీ.. డిజిటల్ కనెక్టివిటీ! వీటితో పాటు ఎడ్యుకేషన్, ప్రజల మధ్య సంబంధాలపైనా ఇరుదేశాల నేతలు చర్చించనున్నారు. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మరోవైపు.. తాష్కెంట్‌లోని శాస్త్రి స్మారకం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఉజ్బెకిస్తాన్‌తో పాటు కిర్గిజ్‌స్టాన్ పర్యటనతో సెంట్రల్ ఏషియాలో భారత్ ప్రభావాన్ని మరింత పెంచే దిశగా మోదీ అడుగులు వేస్తున్నారు. భద్రత నుంచి బిజినెస్ వరకు.. కనెక్టివిటీ నుంచి ఎనర్జీ వరకు..సెంట్రల్ ఏషియాతో భారత్ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేయడమే మోదీ పర్యటన ప్రధాన లక్ష్యం!












