తమిళనాడు రాజధాని చెన్నైని ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. తమిళనాడు స్పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒలింపిక్ సిటీని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

దీని కోసం సమగ్ర ప్రణాళికను రూపొందించి, అధునాతన సౌకర్యాలతో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.

అంతేకాదు.. ఫార్ములా వన్ రేసులకు అనువైన నగరంగా చెన్నైని సిద్ధం చేస్తామని సీఎం విజయ్ తెలిపారు. ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించేలా ప్రత్యేక ట్రాక్‌లను నిర్మిస్తామని వెల్లడించారు.

రానున్న రోజుల్లో చెన్నైని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రపంచ క్రీడా నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.