ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జరగనున్న 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ‘వికసిత భారత్ @2047 కోసం సమగ్ర మానవ అభివృద్ధి’ అనే అంశంపై ఈ సమావేశం జరగనుంది. దేశంలోని అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని మానవ అభివృద్ధి ప్రణాళికపై చర్చించనున్నారు.
సమావేశంలో నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నారు. అవి భవిష్యత్ నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల అభివృద్ధి, ఉపాధి-వ్యవసాయ అవకాశాల విస్తరణ, ఆరోగ్యం-పోషకాహారం, సమానత్వం మరియు గౌరవప్రద జీవనం. అలాగే నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, స్థిరమైన ఉపాధి అవకాశాల సృష్టిపై చర్చలు జరగనున్నాయి. రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను జాతీయ లక్ష్యాలతో అనుసంధానించే అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు.









