అమెరికాలో తెలంగాణ సంస్కృతి వైభవాన్ని చాటిచెప్పే మాటా (Mana American Telugu Association) న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బోనాల జాతర-2026ను ఘనంగా నిర్వహించనున్నారు. జూలై 25, 2026న సాయంత్రం 4 గంటల నుంచి న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం అండ్ కల్చరల్ సెంటర్ – శ్రీ శివ విష్ణు టెంపుల్, ఎడిసన్లో ఈ వేడుకలు జరగనున్నాయి.

తెలంగాణ ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మహంకాళి అమ్మవారికి బోనం సమర్పణ, పోతరాజు ఊరేగింపు, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల సంబరాలను ఘనంగా జరుపుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించగా, భక్తులందరికీ ప్రసాదం అందజేయనున్నారు. పోతరాజుగా పాల్గొనాలనుకునే వారు ముందుగా నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారు తప్పనిసరిగా RSVP నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మధు కుంకు , రఘు శర్మ శంకరమంచి, పురుషోత్తమ్ అనిమెలను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. స్పాన్సర్‌షిప్ అవకాశాల కోసం శ్రీష గుండాపురిని సంప్రదించవచ్చని తెలిపారు.

విదేశాల్లో తెలుగు సంస్కృతి, తెలంగాణ ఆచారాలను తదుపరి తరాలకు చేరవేసే లక్ష్యంతో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ బోనాల జాతర, ఈసారి కూడా ప్రవాస భారతీయుల భాగస్వామ్యంతో మరింత వైభవంగా జరగనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

mata bonalu.jpeg