ఉత్తర అమెరికా తెలుగు సంఘం... తానా మరోసారి తన సేవా స్పూర్తిని చాటింది. ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అమెరికన్ కమ్యూనిటీకి అండగా నిలుస్తూ... పైన్‌విల్‌లోని ఓ చర్చికి భారీ స్థాయిలో ఆహార విరాళాలను అందించింది.

తానా నాయకులు, వాలంటీర్లు కలిసి 75 నిత్యావసర సరుకుల బ్యాగులు, 400 ఫుడ్ కాన్స్ సేకరించి చర్చి నిర్వాహకులకు అందజేశారు. ఈ విరాళం ఎన్నో పేద కుటుంబాల ఆకలి తీర్చేందుకు ఉపయోగపడుతుందని చర్చి ప్రతినిధులు పేర్కొంటూ... తానా బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఛార్లెట్ తానా బృందాన్ని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు అభినందించారు.

ఈ సందర్భంగా ఛార్లెట్ తానా నాయకులు మాట్లాడుతూ... కార్యక్రమానికి సహకరించిన ప్రతి దాతకు, వాలంటీర్‌కు, శ్రేయోభిలాషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రవి (నాని) వడ్లముడి, మాధురి ఏలూరి, కిరణ్ కొత్తపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు. సేవే పరమో ధర్మమని మరోసారి తానా నిరూపించింది.