అమెరికాలోని తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) – న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో 'హైకింగ్-26' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. "Better Tomorrow Begins with a Step" అనే సందేశంతో ఈ ప్రత్యేక హైకింగ్ ఈవెంట్‌ను జూలై 11, 2026 (శనివారం) ఉదయం 8:00 గంటలకు (EST) నిర్వహించనున్నారు.
ఈ హైకింగ్ కార్యక్రమం న్యూజెర్సీలోని సౌర్లాండ్ మౌంటైన్ హైకింగ్ ట్రైల్ (415 E Mountain Rd, Hillsborough Township, NJ-08844)లో జరగనుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు తెలుగు కుటుంబాలు, యువత ఒకే వేదికపై కలుసుకునే అవకాశంగా ఈ కార్యక్రమాన్ని టానా రూపొందించింది.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు నాయకత్వం వహిస్తున్నారు. హైకింగ్ కోఆర్డినేటర్‌గా దశరథ తలపనేని వ్యవహరిస్తుండగా, యువజన కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరితో పాటు పలువురు ట్రస్టీలు, వాలంటీర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.













