అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ సందర్భంగా ATA బిజినెస్ కమిటీ ఆధ్వర్యంలో "ఇండియన్ రియల్ ఎస్టేట్ ప్యానెల్" ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న మహాసభలో భాగంగా నిర్వహించబడుతోంది.

రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవం కలిగిన ప్రముఖులు ఈ ప్యానెల్‌లో పాల్గొని, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని తాజా ధోరణులు, ఎన్ఆర్ఐలకు అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న నగరాలు, భవిష్యత్ మార్కెట్ దిశలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

ఈ ప్యానెల్‌లో ఆర్క్ గ్రూప్ CMD, CREDAI నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామ్ రెడ్డి, GHR Infra వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, Greenrich Group చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ తీగల నర్సి రెడ్డి, MSN Realty అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ బండి వెంకట రమణ, CADOL Group మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి పాల్గొంటారు. ఈ చర్చకు ATA కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ కమిటీ చైర్మన్ హరీష్ బతిని మోడరేటర్‌గా వ్యవహరించనున్నారు.

భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు ఈ ప్యానెల్ ఉపయోగకరమైన సమాచారం అందించనుంది. పరిశ్రమలోని ప్రముఖులతో ప్రత్యక్షంగా చర్చించే అవకాశంతో పాటు నెట్‌వర్కింగ్‌కు కూడా ఇది వేదిక కానుంది.

ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2026-07-29 at 8.23.07 PM (2).jpeg