ఫ్లోరిడాలోని హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2026 (శనివారం) రోజున శ్రీ గణేశ హోమంతో పాటు మేధా హోమంను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులు జ్ఞానం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక హోమాలను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.

ఉదయం 9:30 గంటలకు కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభమై, అనంతరం శ్రీ గణేశ హోమం మరియు మేధా హోమం నిర్వహిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడి అనుగ్రహంతో పాటు, విద్యాదేవత సరస్వతి దేవి ఆశీర్వాదం పొందేందుకు ఇది మంచి అవకాశమని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

శ్రీ గణేశ హోమం సేవా ఆర్తి టికెట్‌ను 31 డాలర్లుగా నిర్ణయించగా, మేధా హోమం పిల్లలకు పూర్తిగా ఉచితం. కొత్త స్కూల్ ఇయర్ ప్రారంభానికి ముందు తమ పిల్లలను ఆలయానికి తీసుకువచ్చి సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని భక్తులకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆలయం ఆహ్వానించింది.

WhatsApp Image 2026-07-30 at 6.36.34 PM.jpeg