అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహిస్తున్న 19వ ATA కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ సందర్భంగా ATA బిజినెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బిజినెస్ సమ్మిట్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 31 నుంచి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, మేరీల్యాండ్లో ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ బిజినెస్ సమ్మిట్‌లో అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్ నాయకులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, ప్రభుత్వ ప్రతినిధులు మరియు వ్యాపార నిపుణులు ఒకే వేదికపై సమావేశమై వ్యాపార అవకాశాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాలపై చర్చించనున్నారు.

కీనోట్ స్పీకర్లుగా మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్, U.S. Department of Transportation CIO పవన్ పిడుగు, 22nd Century Technologies CEO అనిల్ శర్మ పాల్గొననున్నారు.

అదనంగా M&A ప్యానెల్, స్టార్టప్ ప్యానెల్, మోటివేషనల్ సెషన్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం, VC లంచ్ & క్యాపిటల్ రౌండ్‌టేబుల్స్, బిజినెస్ నెట్‌వర్కింగ్ రిసెప్షన్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ATA బిజినెస్ కమిటీ చైర్మన్ అనిల్ బోయినపల్లి మోడరేటర్‌గా వ్యవహరించనుండగా, వ్యాపారవేత్తలు, స్టార్టప్ ఫౌండర్లు, పెట్టుబడిదారులు మరియు ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త వ్యాపార భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

ఆటా మహాసభలను అధ్యక్షుడు జయంత్ చల్లా నాయకత్వంలో ATA టీమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి, కో-కోఆర్డినేటర్ జీనత్ కుందూర్, కో-కన్వీనర్ అరవింద్ ముప్పిడి, కో-నేషనల్ కోఆర్డినేటర్ కౌశిక్, కాన్ఫరెన్స్ రీజినల్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి మునుకుంట్ల, కో-డైరెక్టర్ కిరణ్ ఆలా తదితరులు సమన్వయంతో పనిచేస్తూ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

WhatsApp Image 2026-07-29 at 8.23.58 PM.jpeg