అమెరికా తెలుగు సంఘం (ఆటా) విస్కాన్సిన్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పిక్నిక్ ఘనంగా జరిగింది. విస్కాన్సిన్‌లోని తెలుగు ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రోజంతా ఆహ్లాదకరంగా గడిపారు.
పిక్నిక్‌లో చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ రకాల ఆటలు, సరదా పోటీలు, సంగీతం, నృత్య కార్యక్రమాలతో సందడి నెలకొంది. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగింది.
తెలుగు రుచులతో ప్రత్యేక విందును ఏర్పాటు చేయడం ఈ పిక్నిక్‌కు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బార్బెక్యూ చికెన్‌తో పాటు లైవ్ దోసె, పూర్తి స్థాయి దక్షిణ భారతీయ భోజనాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కుటుంబాలతో వచ్చిన ప్రవాసులు రుచికరమైన వంటకాలను ఆస్వాదిస్తూ సందడి చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్ పోలిరెడ్డి గంటా, రీజినల్ కోఆర్డినేటర్ కరుణాకర్, రీజినల్ అడ్వైజర్ చంద్రమౌళి, రీజినల్ కోఆర్డినేటర్ వెంకట్ జలారి, గోపాల్, ఓబులేష్, మహేష్, వివేకానంద, హేమంత్, విజయ్, నాజర్ రెడ్డి, వెంకట్, శరత్, ఉత్కర్ష్, విక్కీ, చిన్నా, డాక్టర్ మిథున్, సంతోషి, సింధు తదితరులు కీలక పాత్ర పోషించారు.
ఆటా విస్కాన్సిన్ టీమ్ సభ్యులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి పిక్నిక్‌ను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రవాస తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆటలు, సంగీతం, నృత్యాలు, ఆత్మీయ పలకరింపులు, రుచికరమైన దక్షిణ భారతీయ విందుతో సాగిన ఈ పిక్నిక్.. విస్కాన్సిన్ తెలుగు సమాజంలో ఐక్యత, స్నేహభావానికి ప్రతీకగా నిలిచింది.













