హార్ట్‌ఫోర్డ్‌లో నిర్వహించిన “బ్యాండ్ ఇన్‌ఫ్యూషన్ – లైవ్ ఇన్ హార్ట్‌ఫోర్డ్” మ్యూజిక్ ఈవెంట్ ఘన విజయం సాధించింది. హార్ట్‌ఫోర్డ్ హంగామా ఆధ్వర్యంలో, InFusion సమర్పణలో జరిగిన ఈ కార్యక్రమానికి సంగీతాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
ది వెబ్‌స్టర్ థియేటర్, హార్ట్‌ఫోర్డ్ వేదికగా జరిగిన ఈ లైవ్ షోలో బ్యాండ్ సభ్యులు తమ సంగీత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లైవ్ పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి చప్పట్లు, కేరింతలతో మంచి ఆదరణ లభించింది.
కార్యక్రమం అనంతరం Razor ఆధ్వర్యంలో After Party DJ నిర్వహించడంతో వేడుక మరింత ఉత్సాహంగా సాగింది.
ఈ కార్యక్రమానికి Universal Red Carpet (URC) సహకారం అందించగా, Dasara, Dosa Hut South Indian Restaurant, Konaseema Biryani & Dosa, Randy’s Wooster St. Pizza Shop, F3, The Dawat Indian Restaurant, Rocking Horse తదితర సంస్థలు స్పాన్సర్లు/సపోర్టర్లుగా నిలిచాయి.
సంగీతాభిమానుల విశేష ఆదరణతో “బ్యాండ్ ఇన్‌ఫ్యూషన్” లైవ్ మ్యూజిక్ షో గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులు, నిర్వాహకులు, స్పాన్సర్లు, సపోర్టర్లు మరియు ప్రేక్షకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.














