డల్లాస్‌లో సంగీతం, నృత్యంతో పాటు సేవా కార్యక్రమానికి వేదిక సిద్ధమవుతోంది. శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్-2026’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

అక్టోబర్ 4, 2026 ఆదివారం డల్లాస్‌లోని ఇర్వింగ్ ఆర్ట్స్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలందించేందుకు, నేత్ర వైద్య కార్యక్రమాలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శంకర నేత్రాలయ USA వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమెరిటస్ శ్రీ ఎస్.వి. ఆచార్య, శంకర నేత్రాలయ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా. ఎస్.ఎస్. బద్రీనాథ్ సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

క్యాటరాక్ట్ సర్జరీలు, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు, గ్రామీణ టెలి-ఆఫ్తాల్మాలజీ క్యాంపులు వంటి పలు సేవా కార్యక్రమాలకు విరాళాల ద్వారా మద్దతు అందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి డల్లాస్‌లోని తెలుగు, భారతీయ సమాజం పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

WhatsApp Image 2026-08-21 at 11.48.09 PM (1).jpeg