ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి మృతి పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలు, మరపురాని పాత్రలను ఈ సందర్భంగా NATS స్మరించుకుంది.

షావుకారు జానకి గారి నటనా ప్రతిభ తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని NATS చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడ సంతాపం తెలిపారు.

WhatsApp Image 2026-08-21 at 11.51.02 PM (1).jpeg