అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (TDF)–ఆస్టిన్ చాప్టర్ ఆధ్వర్యంలో భారీ బతుకమ్మ–దసరా వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని చాటేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
అక్టోబర్ 17, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లిబర్టీ హిల్‌లోని Rio Ranch Cricket Fields వేదికగా కార్యక్రమం జరగనుంది. బతుకమ్మ వేడుకలతో పాటు దసరా సంబరాలు, సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
TDF 25 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆస్టిన్‌లోని తెలంగాణ, తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని మన సంస్కృతి, మూలాలను ఘనంగా చాటాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం రాజేందర్ లంబు – 916-882-2999, శీతల్ గంపావర్ – 916-475-7444లను సంప్రదించవచ్చు.
















