డల్లాస్–ఫోర్ట్ వర్త్ ప్రాంతంలో Plano Balloon Festival సందడి కొనసాగుతోంది. ప్లానోలోని Oak Point Park వేదికగా సెప్టెంబర్ 17 నుంచి 20 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతోంది.

ఈ ఫెస్టివల్‌లో 40కి పైగా రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లు సందడి చేస్తున్నాయి. వీటిలో 12 ప్రత్యేక ఆకారాల్లో ఉన్న బెలూన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బెలూన్ లాంచ్‌లు, రాత్రి బెలూన్ గ్లోస్, స్కైడైవింగ్ ప్రదర్శనలు, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సందర్శకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా లేజర్ షో కూడా నిర్వహిస్తున్నారు.

పిల్లల కోసం రైడ్స్, క్రాఫ్ట్స్, బౌన్స్ హౌస్‌లతో ప్రత్యేక కిడ్స్ ఏరియా ఏర్పాటు చేశారు.

అడల్ట్స్‌కు జనరల్ అడ్మిషన్ $10, 3 నుంచి 12 ఏళ్ల పిల్లలకు $5గా ఉంది. 36 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. అన్‌లిమిటెడ్ రైడ్ రిస్ట్‌బ్యాండ్ $20 కాగా, పార్కింగ్ ఛార్జీలు లాట్‌ను బట్టి $10 నుంచి $15 వరకు ఉన్నాయి.

అయితే బెలూన్ కార్యక్రమాలు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. దీంతో ఫెస్టివల్‌కు వెళ్లే ముందు తాజా షెడ్యూల్, వాతావరణ పరిస్థితులను చెక్ చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.