అమెరికాలోని ప్రముఖ వైద్యుల సంస్థ Osmania Gandhi Kakatiya Telangana Medical Alumni Association of America (OGKTMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 39వ వార్షిక సదస్సు, సైంటిఫిక్ అసెంబ్లీ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు Hyatt Regency Frisco – Dallas వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుంచి ఓస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ కాలేజీలకు చెందిన వైద్యులు హాజరవుతున్నారు.
వైద్య విజ్ఞానం, నిరంతర వైద్య విద్య, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్‌తో పాటు అలుమ్ని రీయూనియన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో సదస్సు ఉత్సాహంగా కొనసాగుతోంది. OGKTMA ప్రకారం.. అమెరికా వ్యాప్తంగా సంస్థకు 8,000 మందికి పైగా వైద్యుల అలుమ్ని నెట్‌వర్క్ ఉంది. ఈ ఏడాది సదస్సుకు 350 మందికి పైగా వైద్యులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.
నాలుగు గంటల CME సైంటిఫిక్ సెషన్
సదస్సులో ప్రధాన ఆకర్షణగా శనివారం, సెప్టెంబర్ 19న నాలుగు గంటల CME Scientific Session నిర్వహిస్తున్నారు. వైద్యం, ఆరోగ్యం, వెల్‌నెస్, మానసిక ఆరోగ్యం, వైద్య నైతిక విలువలకు సంబంధించిన అంశాలపై నిపుణులు ప్రసంగిస్తున్నారు.
ఉదయం 7:30 నుంచి 8:30 వరకు డాక్టర్ హన్మంత రావు మోలే “Yoga and Meditation – Bridging the Ancient Wisdom and Clinical Evidence” అంశంపై ప్రసంగించనున్నారు.
8:30 నుంచి 9:30 వరకు డాక్టర్ వెంకట నక్త రాజు “Now What” అంశంపై వర్క్-లైఫ్ బ్యాలెన్స్, వర్క్ ఎథిక్స్, ఆరోగ్యం, వెల్‌నెస్, జీవితం–పని పట్ల దృక్పథం వంటి అంశాలను వివరించనున్నారు.
9:50 నుంచి 10:50 వరకు డాక్టర్ సుబ్బారావు బొల్లేపల్లి “Gut-Brain Axis, Microbiome and Mental Health” అంశంపై మాట్లాడనున్నారు.
10:50 నుంచి 11:50 వరకు Kemisha Nordstrom, J.D., TMB “Ethics in Medicine – Principles, Practice & Professional Integrity” అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు.
అలుమ్ని రీయూనియన్లు.. గాలా.. సాంస్కృతిక కార్యక్రమాలు
సైంటిఫిక్ సెషన్లతో పాటు OGKTMA జనరల్ బాడీ మీటింగ్, వివిధ మెడికల్ కాలేజీలకు సంబంధించిన బ్రేక్‌అవుట్ సెషన్లు, అలుమ్ని నెట్‌వర్కింగ్, క్లాస్ రీయూనియన్లు సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
శనివారం సాయంత్రం గ్రాండ్ గాలా కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన Infusion Band రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు లైవ్ మ్యూజిక్‌తో అలరించనుంది.
ఆదివారం సెప్టెంబర్ 20న ఫ్రిస్కోలోని Grandion Event Venueలో బ్రంచ్‌తో సదస్సు ముగియనుంది.
1982లో ప్రారంభమైన OGKTMA
1982లో స్థాపించబడిన OGKTMA.. ఓస్మానియా, గాంధీ, కాకతీయ, తెలంగాణ మెడికల్ కాలేజీల పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి శాస్త్రీయ, విద్యా, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
వైద్య పరికరాలు, మెడికల్ సప్లైస్, స్కాలర్‌షిప్‌లు, మెంటర్‌షిప్ కార్యక్రమాలతో పాటు తెలంగాణలో ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టులకు సంస్థ సహకారం అందిస్తోంది.
OGKTMA ఎగ్జిక్యూటివ్ కమిటీ – 2025–26
Dr. Kiran Mangalpally – President
Dr. Neelima Katukuri – President Elect
Dr. Hema Korlakuntla – Vice President
Dr. Venu Bathini – Secretary
Dr. Kiranmayi Surapaneni – Treasurer
Dr. Surender Sandella – Immediate Past President
Dr. Sujeeth Punnam – Executive Treasurer & Past President
బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్
Dr. Sunil Kaza – Board of Trustees
Dr. Narotham Thudi – Board of Trustees
Dr. Hanmanth Bejjanki – Board of Trustees
Dr. Raghu Lolabhattu – Board of Trustees
Dr. Srivasa Chebrolu – Board of Trustees
Dr. Vinay Katukuri – Board of Trustees
Dr. Vijay Guniganti – Board of Trustees
Regional Directors
Dr. Srikiran Pothamsetty – Regional Director
Dr. Anitha Krishnaswamy – Regional Director
Dr. Srinivas Erragolla – Regional Director
Dr. Sumana Nagireddy – Regional Director
Dr. Surya Nalamati – Regional Director
Regional Representatives
Dr. Guru AR Gopireddy – Regional Representative, West Virginia
Dr. Anil Jonnalagadda – Regional Representative, Texas
వైద్య విజ్ఞానం.. అలుమ్ని ఆత్మీయత.. సేవా స్ఫూర్తి
వైద్య విద్యకు సంబంధించిన తాజా అంశాలపై చర్చలు, CME సెషన్లు, అలుమ్ని రీయూనియన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్‌తో పాటు కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ OGKTMA 39వ వార్షిక సదస్సు ఫ్రిస్కోలో ఘనంగా కొనసాగుతోంది.
📸 Watch on Instagram:
📸 Watch on Instagram:
📸 Watch on Instagram:
📸 Watch on Instagram:
📸 Watch on Instagram:
▶️ Watch on YouTube:
▶️ Watch on YouTube:
▶️ Watch on YouTube:
▶️ Watch on YouTube:
▶️ Watch on YouTube:
















