ఆహ్లాదకరమైన వాతావరణం.. రాయలసీమ వంటకాల ఘుమఘుమలు.. సంగీతం, నృత్యాలు.. చిన్నారుల కోసం ఆటలు, ప్రత్యేక వినోద కార్యక్రమాలు.. కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేసేందుకు సరికొత్త వేదిక!
డల్లాస్‌లోని రాయలసీమ కమ్యూనిటీకి చెందిన కుటుంబాలు, స్నేహితులను ఒక్కచోట చేర్చేలా Dallas Area Rayalaseema Association (DARA) Annual Picnic 2026కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రుచుల నుంచి వినోదం వరకు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
అక్టోబర్ 4న జరగనున్న ఈ వార్షిక పిక్నిక్‌లో సంప్రదాయ రాయలసీమ వంటకాలతో పాటు సంగీత కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఫన్ గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక ఆటలు, వినోద కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అంతేకాదు.. వెండర్ బూత్‌లు, ఛారిటీ కార్యక్రమాలు, కమ్యూనిటీ యాక్టివిటీస్ కూడా పిక్నిక్‌లో భాగం కానున్నాయి. దీంతో అన్ని వయసుల వారికి రోజంతా ఉత్సాహంగా గడిపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.
ఒక్కచోట.. రాయలసీమ బంధం!
అమెరికాలో ఉంటున్న రాయలసీమ కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ పిక్నిక్ ప్రధాన ఉద్దేశం. తమ ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ఈ వేడుక ఒక ప్రత్యేక అవకాశంగా మారనుంది.
నాయకత్వంలో ఘన ఏర్పాట్లు
DARA అధ్యక్షుడు వీర శివారెడ్డి లేవక, ప్రెసిడెంట్-ఎలెక్ట్ గౌతమ్ కసిరెడ్డి, గత అధ్యక్షుడు గౌతమ్ మియాపురం, సెక్రటరీ మహేంద్ర పద్మరాజు, ట్రెజరర్ శ్రీని అన్నారెడ్డి, జాయింట్ ట్రెజరర్లు గురు మల్లెల, అవినాష్ వెల్లంపాటి నాయకత్వంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు అమర్ కలకడ, శ్రీధర్ భూమిరెడ్డి, స్వాతి సన్నపురెడ్డి, నిహారిక లోమడ, సరిత సింగం, మంజుల కొండ, నాగేశ్వర్ అల్లగడ్డ, రమేష్ రెడ్డి దండెల, మల్లికార్జున రెడ్డి బతుల, ఇమ్రాన్ బాషా, చంద్రకాంత్ రెడ్డి కర్ణాటి, విద్యాసాగర్ పల్లా తదితరులు కార్యక్రమ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు.
అడ్వైజరీ అండ్ స్టీరింగ్ కమిటీలో రమణ పుట్లూరి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ కమేట, హరి సింగం, లోకేష్ నాయుడు, ఇస్మాయిల్ పెనుకొండ, అనూప్ దేవిరెడ్డి, భాస్కర్ గరిడికోట, సునీల్ దేవిరెడ్డి, జయచంద్ర గజ్జలపల్లి, మధు మల్లు, మల్లికార్జున మురారి, ప్రేమ్ గంగులకుంట, సతీష్ బొమ్మినేని తదితరులు తమ సహకారం అందిస్తున్నారు.
అక్టోబర్ 4న రాయలసీమ రుచులు.. సంబరాల సందడి!
రాయలసీమ రుచులు, సంగీతం, నృత్యాలు, ఆటలు, చిన్నారుల వినోదం, కమ్యూనిటీ కార్యక్రమాలతో DARA Annual Picnic 2026 డల్లాస్‌లోని రాయలసీమ కమ్యూనిటీకి ఒక ప్రత్యేకమైన కలయిక వేదికగా నిలవనుంది.
📅 తేదీ: ఆదివారం, అక్టోబర్ 4, 2026
⏰ సమయం: ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00 వరకు
📍 వేదిక: HMR Grand, 1072 W Sherman Dr, Aubrey, TX 76227
కలుద్దాం.. రాయలసీమ రుచులు ఆస్వాదిద్దాం.. సంస్కృతిని సెలబ్రేట్ చేసుకుందాం.. కుటుంబాలతో కలిసి సందడి చేద్దాం!














