ఫ్రాన్స్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా బతుకమ్మ–దసరా సంబరాలు 2026 నిర్వహించేందుకు ఫ్రాన్స్ తెలుగు కమ్యూనిటీ (FTC) సిద్ధమైంది. ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.

అక్టోబర్ 25, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఫ్రాన్స్‌లోని మాస్సీ, 1 Avenue du Général de Gaulle వేదికగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

వేడుకల్లో భాగంగా దుర్గా పూజ, బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు సంగీతం, నృత్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేయనున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే వారి కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఫ్రాన్స్‌లోని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ, దసరా పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకునేలా FTC ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటిచెప్పేలా కార్యక్రమాలను రూపొందించారు.

కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం FTC కమ్యూనికేషన్ నంబర్ +33 7 71 69 37 80ను సంప్రదించవచ్చు.

సంప్రదించాల్సిన నంబర్లు:

  • Neela Srinivas: +33 6 63 78 07 13

  • Upender Nathi: +33 7 61 71 83 25

  • Balaboyina Ravi: +33 6 51 74 33 79

  • FTC Flayer.jpg