2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ‘వికసిత్ భారత్’ స్ఫూర్తి విదేశీ గడ్డపై కూడా ప్రతిధ్వనిస్తోంది. సేవా పక్షోత్సవాలైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ‘వికసిత్ భారత్ రన్ 2026’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
ఇందులో భాగంగా స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో 2వ ఎడిషన్ వికసిత్ భారత్ రన్ 2026ను భారత రాయబార కార్యాలయం ఘనంగా నిర్వహించింది. Anchor Sports, Sweden Telugu Community భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5 కిలోమీటర్ల రన్‌ను చేపట్టారు.
ఈ రన్‌లో స్టాక్‌హోమ్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఐక్యత, సేవాభావం, సమాజం పట్ల బాధ్యత వంటి స్ఫూర్తిని చాటుతూ రన్‌లో పాల్గొన్న వారు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
వికసిత్ భారత్ లక్ష్యానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా దేశ అభివృద్ధి సంకల్పంతో తమ అనుబంధాన్ని చాటారు. స్టాక్‌హోమ్‌లో జరిగిన ఈ రన్ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

















