అమెరికాలోని ఇల్లినాయిస్‌ నాపర్‌విల్లేలో కళాభిమానులకు గుడ్‌న్యూస్..! HUM – Help, Unite, Motivate ఆధ్వర్యంలో ఉచిత Arts Painting Skill-Building Workshop నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వర్క్‌షాప్‌ జరగనుంది.

Mall of India Parking Lotలోని Swadesi Mela Booth #50 వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్నవారు ఈ ఉచిత వర్క్‌షాప్‌లో పాల్గొని తమలోని సృజనాత్మకతను వెలికితీసుకోవడంతో పాటు, ఆర్ట్‌ స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కల్పిస్తున్నారు.

పిల్లలు, యువతతో పాటు పెయింటింగ్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

కాగా, వర్క్‌షాప్‌లో పాల్గొనాలనుకునే వారు ముందుగా RSVP చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.

hum flayer.jpeg