అమెరికాలోని బే ఏరియాలో గణేష్ నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమైంది. Namaste Bay Area ఆధ్వర్యంలో “Ganpati Bappa Morya – East Bay Ka Raja” పేరుతో గ్రాండ్ గణేష్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 19, 2026, శనివారం నాడు San Ramon – City Center, Bishop Ranchలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా 12 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు లడ్డూ వేలం నిర్వహించనున్నారు.

భక్తుల కోసం రోజంతా ప్రసాదం అందుబాటులో ఉండనుంది. కార్యక్రమానికి ప్రవేశం ఉచితం, అలాగే ఉచిత పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు.

“ప్రతి కుటుంబానికీ ఓ గణేశ సంప్రదాయం ఉంటుంది.. మీ కుటుంబం ఎప్పటికీ మిస్ కాకుండా పాటించే గణేశ సంప్రదాయం ఏమిటి?” అంటూ నిర్వాహకులు కుటుంబాలను ఈ వేడుకలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తున్నారు.

మరిన్ని వివరాలకు 650-776-1203, స్పాన్సర్‌షిప్ కోసం 408-242-5111, వెండర్ బూత్‌ల కోసం 408-499-6530, సాంస్కృతిక కార్యక్రమాల కోసం 510-421-3535 నంబర్లను సంప్రదించవచ్చు.

Namaste Bay Area ఆధ్వర్యంలో జరగనున్న ఈ గణేష్ మహోత్సవం బే ఏరియాలోని భారతీయ కుటుంబాలకు భక్తి, సంప్రదాయం, సంస్కృతిని ఒకే వేదికపై ఆస్వాదించే ప్రత్యేక వేడుకగా నిలవనుంది.

namaste bayarea.jpg