తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో బతుకమ్మ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 17, 2026న మిన్నెసోటాలో ఈ వేడుకలు జరగనున్నాయి. రంగురంగుల పూలతో పేర్చే బతుకమ్మలు, సంప్రదాయ పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు సందడిగా సాగనున్నాయి.
తెలంగాణ సంస్కృతి, గర్వం, ఐక్యతను చాటిచెప్పేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. “Our Culture.. Our Pride.. Our Bond.. Let’s Celebrate Together!” అనే సందేశంతో మిన్నెసోటా తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకురావడానికి MATA సిద్ధమవుతోంది.
MATA అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి కటంగూరి ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అమెరికాలోని తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయ వేడుకలకు మిన్నెసోటా వేదిక కానుండటంతో.. అక్టోబర్ 17న అక్కడ బతుకమ్మ పండుగ సందడి నెలకొననుంది.
















