అమెరికాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల సందడి మళ్లీ మొదలుకానుంది. అరిజోనాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అక్టోబర్ 10, 2026 శనివారం ఫీనిక్స్‌లోని El Zaribah Shrine Auditorium వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. “Culture, Tradition & Togetherness” థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

బతుకమ్మ సంబరాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ కార్యక్రమాలు, కుటుంబ సమేతంగా ఆస్వాదించే వినోద కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక యాక్టివిటీస్‌తో పాటు ఆహారం, రిఫ్రెష్‌మెంట్స్‌ వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రవేశం, భోజనం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు.

యువతకు వాలంటీర్‌గా అవకాశం

ఈ వేడుకల్లో యువతను భాగస్వాములను చేసేందుకు Youth Volunteer Teamను ఏర్పాటు చేశారు. 13 ఏళ్లు పైబడిన, 8వ తరగతి నుంచి విద్యార్థులు వాలంటీర్లుగా పాల్గొనవచ్చు.

ఈవెంట్ సెటప్, స్టేజ్ అండ్ ప్రోగ్రామ్ సపోర్ట్, రిజిస్ట్రేషన్, గెస్ట్ వెల్‌కమ్, ఫోటోగ్రఫీ, సోషల్ మీడియా, ఫుడ్ అండ్ రిఫ్రెష్‌మెంట్ సపోర్ట్, కిడ్స్ యాక్టివిటీస్, క్లీనప్ వంటి విభాగాల్లో సేవలందించే అవకాశం కల్పించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లెక్సిబుల్ షిఫ్టులు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

టీటీఏ అరిజోనా టీమ్ ఆధ్వర్యంలో

ఈ మెగా వేడుకల నిర్వహణలో TTA Arizona టీమ్ కీలకంగా వ్యవహరిస్తోంది. Regional Vice Presidentsగా Anoop Kiran Godishala, Avinash Reddy Nandyala, Dinesh Reddy Sudula, Karthik Panjala బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Core Membersగా Shravan Kumar Gampa, Rama Krishna Nalla, Vasantha Sumanth, Treasurersగా Pankaj Padala, Pradeep Chandupatla సేవలందిస్తున్నారు. అలాగే Jyothi Reddy Dudipala, Praveen Samala బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ లోకల్ చైర్‌గా కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్నారు.

అమెరికాలోని భావితరాలకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు TTA Arizona టీమ్ తెలిపింది. అరిజోనాలోని తెలుగువారంతా కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

TTA Arizona Batukamma.jpg