ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS (North America Telugu Society) చికాగో చాప్టర్‌కు 2026–2028 కాలానికి కొత్త నాయకత్వ బృందం ఎన్నికైంది. చాప్టర్ లీడ్‌గా నరేంద్ర కడియాల బాధ్యతలు చేపట్టనున్నారు.
తెలుగు సమాజాన్ని మరింత బలోపేతం చేయడం, కమ్యూనిటీ సేవలను విస్తరించడం, తెలుగు సంస్కృతి–సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా నూతన బృందం పనిచేయనుంది.
నరేంద్ర కడియాలతో పాటు అంజయ్య వెలూరి, మహేష్ కిలారు, ప్రతిభ వట్టికూటి, దివ్య శ్రీ వేముల, సతీష్ త్రిపురనేని, చెన్నయ్య కంబాల, వరుణ్ కుమార్ రెడ్డి గడ్డం, నాగరాజ్ మేడ, భాను చంద్ర కీర్తి, సుబ్బరాయుడు చవాడం చికాగో చాప్టర్ టీమ్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. చికాగో చాప్టర్ నూతన నాయకత్వానికి BOD & EC సభ్యులు శ్రీనివాస్ బొప్పన, శ్రీరామ్ కొప్పాక, శేషు మారంరెడ్డి, మదన్ పాములపాటి, వీర తక్కెళ్లపాటి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా NATS చైర్మన్ కిశోర్ కంచర్ల, NATS ప్రెసిడెంట్ రాజ్ అల్లాడ నూతన బృందానికి అభినందనలు తెలిపారు. నాయకత్వం, సేవ, సమాజ అభివృద్ధి దిశగా కొత్త టీమ్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలుగు సమాజ సేవలో కొత్త ఉత్సాహంతో.. NATS చికాగో చాప్టర్ ముందడుగు వేయనుంది!
















