అమెరికాలోని తెలుగు క్రికెట్ అభిమానులకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) శుభవార్త అందించింది. GTA డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో "GTA 100 క్రికెట్ టోర్నమెంట్ 2026"ను వచ్చే ఏడాది ఆగస్టు 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌కు మిచిగన్ రాష్ట్రంలోని కాన్టన్ స్పోర్ట్స్ సెంటర్ వేదిక కానుంది. అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు క్రికెట్ జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. క్రికెట్ ప్రేమికులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, ఉత్సాహభరితమైన వాతావరణం అందించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
వ్యవస్థాపకులు, అడ్వైజరీ చైర్మన్ విశ్వేశ్వర్ కలవాల, చైర్మన్ ప్రవీణ్ కేసిరెడ్డి, అధ్యక్షుడు బాపురెడ్డి కేతిరెడ్డి, ప్రెసిడెంట్-ఎలెక్ట్ రవీందర్ గడ్డంపల్లి, అలాగే డెట్రాయిట్ చాప్టర్ ప్రతినిధుల నాయకత్వంలో ఈ టోర్నమెంట్ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్లకు అత్యుత్తమ పోటీ వాతావరణాన్ని కల్పించేందుకు నిర్వాహక బృందం విస్తృత స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ అన్ని ఏర్పాట్లను సమన్వయం చేస్తోంది.
టోర్నమెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, నమోదు ప్రక్రియ కోసం www.globaltelangana.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.














