కొలరాడోలోని డెన్వర్ తెలుగు కమ్యూనిటీకి చెందిన GTA తెలంగాణ డెన్వర్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘మైల్ హై పికిల్‌బాల్ లీగ్’ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 29, 2026 శనివారం లిటిల్‌టన్‌లోని Epic Pickleball Clubలో ఈ పోటీలు జరగనున్నాయి.

అన్ని వయసులు, అన్ని నైపుణ్య స్థాయిల వారికి ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. బిగినర్స్ నుంచి అడ్వాన్స్‌డ్ ప్లేయర్ల వరకు అందరూ పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.

పోటీతో పాటు స్నేహబంధాలు, కమ్యూనిటీ కనెక్షన్స్, వినోదానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనే ఆటగాళ్లకు రిఫ్రెష్‌మెంట్స్, స్నాక్స్ కూడా అందించనున్నారు.

GTA Pickleball.jpg