హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) తమ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. "మన భాష – మన సంస్కృతి – మన సంప్రదాయం" అనే సందేశంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు తెలుగు సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆగస్టు 7, 8 తేదీల్లో టెక్సాస్ రాష్ట్రంలోని రోసెన్‌బర్గ్‌లోని ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్ వేదికగా జరగనున్నాయి.
ఈ ఏడాది వేడుకలకు "Nurturing Values Through Tradition" (సాంప్రదాయం ద్వారా విలువల పెంపు) అనే ప్రత్యేక థీమ్‌ను ఎంపిక చేశారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు, తెలుగు వారసత్వాన్ని చిన్నారులకు చేరవేసేలా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు.
ఈ సందర్భంగా పిల్లల కోసం శ్లోక పఠన పోటీలు (Sloka Recitation), వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, భక్తి భావాన్ని పెంచడం, మన సంప్రదాయాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.
ఈ స్వర్ణోత్సవ వేడుకలకు TCA అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనదలచిన పిల్లల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం tca50.org లేదా www.houstontca.org వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. అదనపు సమాచారం కోసం coreeteam@tca50.org ఇమెయిల్ ద్వారా నిర్వాహకులను సంప్రదించవచ్చని తెలిపారు.











