హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) తమ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా టీపీఎల్ (TPL) పికిల్‌బాల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించింది. క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకరమైన జీవనశైలి, స్నేహపూర్వక పోటీని ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు హ్యూస్టన్ తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది.
జూలై 11, 2026 (శనివారం) న పికిల్‌బాల్ విలేజ్, కేటీ (Katy), టెక్సాస్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో అన్ని వయస్సుల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.ఆసక్తికరమైన మ్యాచ్‌లు ప్రేక్షకులను అలరించగా, పోటీతో పాటు స్నేహబంధాలు మరింత బలపడేలా ఈ కార్యక్రమం నిలిచింది.
ఈ టోర్నమెంట్‌ను హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో, కన్వీనర్ జితేందర్ రెడ్డి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. వారి నాయకత్వంలో వాలంటీర్లు, నిర్వాహక బృందం సమిష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు










