అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న "America Freedom 250 Liberty Gala" కార్యక్రమంలో ప్రముఖ సాంస్కృతిక కళాకారిణి ఇంద్రాణి దావులూరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ వేడుకకు ఆమె Heritage Chairగా వ్యవహరిస్తూ, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని నృత్యరూపంలో ఆవిష్కరించనున్నారు.
Lead America మరియు Interfaith Leadership Alliance సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ గాలా కార్యక్రమం జూలై 19, 2026న అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్, మేరీల్యాండ్లో జరగనుంది. "Unity in Diversity – Soul of America" అనే థీమ్‌తో నిర్వహించే ఈ వేడుకలో సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, అవార్డుల ప్రదానం, కమ్యూనిటీ నాయకుల సన్మానం వంటి పలు విశేషాలు ఉండనున్నాయి. ప్రవేశం పూర్తిగా ఉచితం.
ప్రముఖ నృత్య గురువుగా, నాట్యమార్గం డ్యాన్స్ స్కూల్ వ్యవస్థాపకురాలైన ఇంద్రాణి దావులూరి, కళల ద్వారా సంస్కృతులను కలిపే శక్తిని ప్రపంచానికి చాటుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె నృత్య ప్రదర్శన అమెరికా బహుళ సాంస్కృతిక స్ఫూర్తికి ప్రతీకగా నిలవనుందని పేర్కొన్నారు.









