అమెరికాలోని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జార్జియాలోని గ్రేటర్ అట్లాంటా ప్రాంతంలో IOC అట్లాంటా చాప్టర్ను అధికారికంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్టు 29, శనివారం, జాన్స్ క్రీక్‌లోని బిర్యానీ వరల్డ్ ఫ్యూజన్ అండ్ గ్రిల్లో జరగనుంది.

గ్రేటర్ అట్లాంటా ప్రాంతంలోని భారతీయ-అమెరికన్ సమాజ సభ్యులు, మద్దతుదారులు, స్థానిక నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. స్థానిక స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, పౌర చైతన్యాన్ని ప్రోత్సహించడం, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ద్వారా మరింత బలమైన ప్రవాస భారతీయ సమాజాన్ని నిర్మించడమే కొత్త చాప్టర్ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, IOCకి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరుకానున్నారు. IOC అట్లాంటా చాప్టర్ ప్రతినిధి అనిల్ బొద్దిరెడ్డీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

అట్లాంటా ప్రాంతంలోని భారతీయ-అమెరికన్ సమాజాన్ని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కొత్త చాప్టర్ కీలక వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

atlanata.png