అమెరికాలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన నరేష్ ఎం. గేహీ మరో ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకున్నారు. క్వీన్స్ కౌంటీ బార్ అసోసియేషన్ (QCBA) ఇమ్మిగ్రేషన్ కమిటీకి ఆయనను వైస్ చైర్మన్‌గా నియమించింది.
ఈ సందర్భంగా గేహీ & అసోసియేట్స్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ నియామకం నరేష్ గేహీ న్యాయ సేవల పట్ల ఉన్న అంకితభావానికి, ఇమ్మిగ్రేషన్ చట్ట రంగంలో ఆయన చూపుతున్న నాయకత్వానికి గుర్తింపుగా నిలుస్తుందని తెలిపారు.
ఇమ్మిగ్రేషన్ న్యాయ వ్యవస్థలో న్యాయం, సమానత్వం, వలసదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ హోదాలో నరేష్ గేహీ ఇమ్మిగ్రేషన్ చట్టాలకు సంబంధించిన కీలక చర్చలు, విధాన రూపకల్పన, న్యాయవాదుల వృత్తి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యపాత్ర పోషించనున్నారు.
ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు వచ్చిన వలసదారులకు న్యాయ సహాయం అందించడంలో గేహీ & అసోసియేట్స్ విశేష సేవలు అందిస్తోందని, భవిష్యత్తులో కూడా తమ క్లయింట్ల హక్కుల కోసం అంకితభావంతో పనిచేస్తామని సంస్థ వెల్లడించింది.
ఈ సందర్భంగా నరేష్ ఎం. గేహీకి న్యాయవర్గం, సామాజిక సంస్థలు, ప్రవాస భారతీయులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.















