మిచిగన్ రాష్ట్రంలోని కాంటన్ టౌన్‌షిప్‌లో ఆగస్టు 1, 2026 (శనివారం) నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ దివ్య వేడుకలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు.

ఈ మహోత్సవం రోజంతా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగనుంది. ముఖ్యంగా, భారతదేశంలోని అరుపడై వీడు (ఆరు పవిత్ర మురుగన్ క్షేత్రాలు) దర్శించిన అనుభూతిని ఒకేచోట పొందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా నిలవనుంది.

ఈ సందర్భంగా నిర్వహించే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణంలో 108 దంపతులు పాల్గొనే అవకాశం కల్పించారు. ఇప్పటికే అధిక సంఖ్యలో నమోదులు పూర్తికాగా, మరికొన్ని స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు వెల్లడించారు. అందువల్ల పాల్గొనాలనుకునే దంపతులు వీలైనంత త్వరగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ఈ దివ్య కల్యాణంలో పాల్గొనడం ద్వారా దంపతులు, కుటుంబ సభ్యులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహాన్ని పొందడంతో పాటు ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవించే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి భక్తుడు తన విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఈ మహోత్సవంలో గడిపి, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని వారు కోరారు.

subramanya swamy flayer.jpg