టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన మార్క్ హిల్‌కు టాంటెక్స్ (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫ్రిస్కో నగరం ఎప్పటిలాగే అభివృద్ధి, అవకాశాలు, వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఇక్కడ నివసించే ప్రజల ఐక్యత, పరస్పర గౌరవం, సమానత్వ భావనలు నగర పురోగతికి బలమైన పునాదులుగా ఉన్నాయని పేర్కొన్నారు.
మార్క్ హిల్ నాయకత్వంలో ఫ్రిస్కో నగరం మరింత అభివృద్ధి చెందుతూ, అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సమగ్ర పురోగతికి ఆయన కృషి చేయాలని ఆశిస్తూ టాంటెక్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫ్రిస్కో భవిష్యత్ మరింత ప్రకాశవంతంగా ఉండాలని, నగరం అన్ని రంగాల్లో విజయవంతంగా ముందుకు సాగాలని మాధవి లోకిరెడ్డి ఆకాంక్షించారు.


















