అమెరికాలో తెలుగు సమాజ సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న కమ్యూనిటీ లీడర్ సత్యం యాదగిరికి ప్రముఖ న్యాయవాదులు ఘనంగా సన్మానం నిర్వహించారు. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ, తెలుగు కమ్యూనిటీ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖ అటార్నీలు మాట్లాడుతూ, సత్తన్న సమాజానికి అంకితభావంతో సేవలందిస్తూ తెలుగు ప్రజల ఐక్యతకు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కమ్యూనిటీ కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ సన్మానం పట్ల స్పందించిన సత్యం యాదగిరి, తనకు ఈ అరుదైన గౌరవాన్ని అందించిన ప్రముఖ న్యాయవాదులు, కమ్యూనిటీ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా సమాజ సేవను ఇదే నిబద్ధతతో కొనసాగిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాదులతో పాటు ప్రవాస భారతీయులు, కమ్యూనిటీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సత్తన్నను అభినందించారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.













