అమెరికాలోని చికాగోలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం, అక్టోబర్ 18, 2026న ఉదయం 11:30 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి.
ఆరోరాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు “Memories in Every Thread” అనే ప్రత్యేక థీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అమ్మ, అమ్మమ్మల చీరలు, పాతకాలపు వింటేజ్ చీరలు, పెళ్లి చీరలు, కుటుంబ వారసత్వంగా వచ్చిన చీరలు ధరించి పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు Bathukamma Chairగా మాధవి రాణి కోనకల వ్యవహరిస్తున్నారు. Co-Chairsగా రమ్య నాగులవంచ్ల, రచన కొలుగూరి, శైలా జెఠి బెతి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. TAGC అధ్యక్షురాలు అర్చన పూడ్డుతూరి ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
55 సంవత్సరాల సేవలను జరుపుకుంటున్న TAGC, ఈసారి బతుకమ్మ పండుగను సంప్రదాయం, కుటుంబ జ్ఞాపకాలు, తెలుగు సంస్కృతి కలయికగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.














