అమెరికాలోని నార్త్ కరోలినాలో TANA Team Square 5K Walk/Run 2026 నిర్వహించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు కుటుంబాలకు అండగా నిలుస్తున్న TANA Emergency Assistance Management Team (TEAM SQUARE)కు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

సెప్టెంబర్ 20న ఉదయం 7:30 గంటలకు కాంకర్డ్‌లోని Frank Liske Parkలో ఈ 5K రన్/వాక్ జరగనుంది. అన్ని వయసుల వారు పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి TANA అధ్యక్షుడు డా. నరేన్ కోడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు నాయకత్వం వహిస్తున్నారు. అలాగే TANA ట్రెజరర్ రాజా కసుకుర్తి, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యర్లగడ్డ, TANA ఫౌండేషన్ ట్రస్టీ శ్రీనివాస్ కుకట్ల లీడర్‌షిప్ సపోర్ట్ అందిస్తున్నారు.

సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రవేశం, ముందుగా రిజిస్టర్ చేసుకునేవారికి ఫ్రీ టీ-షర్ట్, పిల్లలకు క్యాష్ ప్రైజులు అందించనున్నారు. Dawat ఆధ్వర్యంలో బ్రేక్‌ఫాస్ట్, రిఫ్రెష్‌మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

దాదాపు రెండు దశాబ్దాలుగా సంక్షోభ సమయాల్లో తెలుగు కుటుంబాలకు సహాయం అందిస్తున్న TEAM SQUARE సేవలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

TANA.jpg