అమెరికాలోని మెంఫిస్ తెలుగు సంఘం Telugu Association of Memphis (TAM) ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ‘Her Era – Her Pride, Our Legacy’ థీమ్‌తో TAM Mahila 2026 వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెంఫిస్ తెలుగు సమాజంలో సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న TAM 1981 నుంచి సేవలందిస్తోంది.
ఆగస్టు 29, శనివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. మహిళల ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సంప్రదాయం, ఆధునికతను ప్రతిబింబించేలా ఈ వేడుకలను రూపొందించారు. కార్యక్రమానికి Indo-Western డ్రెస్ కోడ్‌ను నిర్ణయించారు. బ్రిడ్జర్టన్ స్టైల్, షరారాలు, చీరలు, ఫ్యూజన్ ఫ్యాషన్‌లో మహిళలు పాల్గొనవచ్చు.
వేడుకల్లో ఇండియన్ వంటకాలు, డెజర్ట్స్, వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మహిళల వివిధ రంగాల్లోని ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారిలో స్ఫూర్తిని నింపేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
TAM 2026 కార్యవర్గం, Rajani Narra Cultural Secretary, Sahiti Kilaru Joint Cultural Secretary , తదితరులు ఈ ఈవెంట్ విజయవంతం కావాాటానికి విశేష కృషి చేస్తున్నారు. Empower Her Universe – A Legacy of Limitless Potential” అనే సందేశంతో జరగనున్న ఈ మహిళా వేడుకకు మెంఫిస్ తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
టికెట్ వివరాలు
TAM సభ్యులకు: ఉచితం
నాన్-మెంబర్స్‌కు: $15
Contact
Rajani Narra: 901-910-9001
Sahiti Kilaru: 915-449-2523













