అమెరికాలోని తెలుగు సంఘం Telugu Association of Metro Atlanta (TAMA) ఆధ్వర్యంలో TAMA Dance Utsav 2026 నిర్వహించనున్నారు. అన్ని వయసుల వారికి ఓపెన్‌గా ఉండే ఈ డ్యాన్స్‌ పోటీలు సెప్టెంబర్‌ 13న గ్రాండ్‌గా జరగనున్నాయి.

సెప్టెంబర్‌ 13, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. జాన్స్‌ క్రీక్‌లోని Sixers Sports Center వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.

ఈ పోటీల్లో క్లాసికల్ డ్యాన్స్‌, ఫ్రీస్టైల్ డ్యాన్స్‌ విభాగాల్లో పాల్గొనే అవకాశం ఉంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు తమ డ్యాన్స్‌ ప్రతిభను ప్రదర్శించవచ్చు.

పోటీల్లో పాల్గొనాలనుకునే వారు TAMA అధికారిక వెబ్‌సైట్‌లోని Dance Utsav పేజీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పార్వతి కొంపెల్లను (561) 359-4041 నంబర్‌లో సంప్రదించవచ్చు.

TAMA అధ్యక్షురాలు సునీత పొత్నూరు, ఛైర్మన్‌ మధుకర్‌ యార్లగడ్డ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి, కళలను ప్రోత్సహించడంతో పాటు.. వివిధ వయసుల వారిలోని డ్యాన్స్‌ టాలెంట్‌ను వెలుగులోకి తీసుకురావడమే ఈ Dance Utsav ప్రధాన ఉద్దేశం.

TAMA Flayer.heic