మిచిగన్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటిచెప్పేలా ట్రాయ్ తెలుగు అసోసియేషన్ 20వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించనున్నారు. “20 Years of Unity, Culture & Tradition” అనే నినాదంతో ఈ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు. 2006లో ప్రారంభమైన సంస్థ రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీనివాస కల్యాణం
వేడుకలు సెప్టెంబర్ 26, శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. 4200 Andover Rd., Bloomfield Hills, Michigan వేదికగా కార్యక్రమాలు జరగనున్నాయి.
ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీవారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుపతి లడ్డూ ప్రసాదం, ధోతీ, షర్ట్, కండువా, చీరతో పాటు అల్పాహారం, కల్యాణ భోజనం, పూజా సామగ్రి అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కల్యాణ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ఫీజు $251గా నిర్ణయించారు.
తెలుగు పాటల పోటీ
తెలుగు భాష, సంగీతంపై యువతలో ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో తెలుగు పాటల పోటీ నిర్వహిస్తున్నారు. ఇది 16 ఏళ్లలోపు పిల్లలు, 16 ఏళ్లకు పైబడిన పెద్దలు అనే రెండు విభాగాల్లో జరుగుతుంది. సెప్టెంబర్ 19న జరిగిన పోటీలో ఎంపికైన టాప్-5 గాయకులు నేటి 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఫైనల్స్‌లో పాల్గొంటారు.
ఒక నిమిషం రీల్ పోటీ
“Passing Our Culture to New Generations” అనే అంశంపై ఒక నిమిషం నిడివి గల రీల్/షార్ట్ వీడియో పోటీని కూడా నిర్వహిస్తున్నారు. ఒక్కో ఎంట్రీకి $25 ఫీజు నిర్ణయించారు. ప్రేక్షకుల ఎంపిక ద్వారా ఇద్దరు విజేతలను ప్రకటించి నగదు బహుమతులు అందించనున్నారు.
మ్యాట్రిమోనియల్ మీట్
తెలుగు కుటుంబాల మధ్య పరిచయాలు, సంబంధాలను పెంపొందించేందుకు మ్యాట్రిమోనియల్ మీట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. “Meet – Connect – Celebrate” అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు
రోజంతా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్, యువత, సీనియర్లు, ఆర్థిక అంశాలపై సెమినార్లు, మ్యాట్రిమోనియల్ సెషన్లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సంప్రదాయ పద్ధతిలో అరటి ఆకులపై భోజనం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, అనంతరం బఫే డిన్నర్ ఏర్పాటు చేశారు.
మహిళలకు సహాయం
వేడుకల్లో నిర్వహిస్తున్న పాటల పోటీ, రీల్ పోటీల ద్వారా వచ్చే మొత్తాన్ని భారత్‌లో అవసరాల్లో ఉన్న మహిళలకు HAND (Human Action for Need and Development) సంస్థ ద్వారా సహాయం చేయడానికి వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉచిత ప్రవేశం
ఈ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రవేశం అందరికీ ఉచితం. కార్యక్రమ ప్రాంగణంలో వివిధ స్టాళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
వెబ్‌సైట్: www.troytelugu.org
ఈమెయిల్: cultural@troytelugu.org














