అమెరికాలోని తెలంగాణ వాసుల ప్రముఖ సంస్థ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న “టీటీఏ మెగా కన్వెన్షన్ 2026” వేడుకలకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఉత్తర కారోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జూలై 17 నుంచి 19, 2026 వరకు ఈ మహాసభలు ఘనంగా జరగనున్నాయి.

ఈ కన్వెన్షన్‌లో యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు, ఉత్సాహవంతులైన యువ వాలంటీర్లతో కూడిన టీటీఏ యూత్ కమిటీ (TTA Youth Committee) సభ్యుల నమోదు ప్రక్రియను ప్రారంభించింది. యువతలో నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించడం, కమ్యూనిటీ సేవలో భాగస్వామ్యం కల్పించడం, కన్వెన్షన్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

ఆసక్తి గల యువతీయువకులు ఆన్‌లైన్‌లో లేదా ప్రచార పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ లింక్: https://tinyurl.com/TTAYouthVolunteer

మరిన్ని వివరాల కోసం 704-606-4618 నంబర్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపవచ్చు. అలాగే 1-866-TTA-SEVA హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.

అధికారిక వెబ్‌సైట్లు:
www.mytelanganaus.org
www.ttaconvention.org

టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో భాగస్వాములై, తెలుగు సమాజానికి సేవ చేసే అరుదైన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

TTA.jpg