తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్-2026లో యువతలోని వ్యాపార ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో "యూత్ షార్క్ ట్యాంక్ కాంపిటీషన్" నిర్వహించనుంది. స్టార్టప్‌లు, క్రియేటివ్ బిజినెస్ ఐడియాలతో ముందుకు రావాలనుకునే యువతకు ఈ పోటీలు అద్భుతమైన వేదికగా నిలవనున్నాయి.
ఈ పోటీలు జూలై 18, 2026 (శనివారం) నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే టీటీఏ మెగా కన్వెన్షన్‌లో నిర్వహించబడతాయి. పోటీల్లో 12-14 సంవత్సరాలు, 15-18 సంవత్సరాలు అనే రెండు వయో విభాగాల్లో విద్యార్థులు పాల్గొనవచ్చు.
పోటీల్లో పాల్గొనాలనుకునే వారు ఫ్లయర్‌లోని QR కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ప్రణవి – 704-606-4618 ను సంప్రదించవచ్చు.
ఈ ప్రతిష్ఠాత్మక టీటీఏ మెగా కన్వెన్షన్-2026ను అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కన్వెన్షన్ కోఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి, శేఖర్ రెడ్డి నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే టీటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్, వివిధ బోర్డులు, కమిటీల సభ్యులు సమిష్టి కృషితో ఈ మహాసభలను విజయవంతం చేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యువత, కుటుంబాలు, తెలుగు సమాజానికి గుర్తుండిపోయే కన్వెన్షన్‌గా తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు.














