దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని.. డల్లాస్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. కార్టర్ బ్లడ్‌కేర్ సహకారంతో సెప్టెంబర్ 26న ఈ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కాపెల్‌లోని Coppell ER, 720 N Denton Tap Road వద్ద రక్తదాన శిబిరం కొనసాగనుంది.
వైఎస్ఆర్ అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి.. ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రక్తదానం చేయాలనుకునే వారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దాతలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తీసుకురావాలి.
ఒక్కసారి చేసే రక్తదానం.. ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం కల్పిస్తుంది.
For More Information, Contact:
Dr. Rajendra Polu – (940) 595-5695
Sudhakar Menakuru – (469) 386-1723
Siva Valluru – (201) 783-7438
Nagarjuna Reddy Darukamalli – (469) 924-5412
RBS Reddy (Subbu) – (847) 507-4729
Veera Siva Reddy Levaka – (817) 736-7072
Tarun Reddy Ponkala – (512) 202-6430
Srikanth Reddy – (913) 230-4480















