మన తెలంగాణ/హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్కో డిఇ ముత్యం వెంకటరమణకు నాంపల్లి ఎసిబి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆరున్నర దశాబ్దాల చరిత్రలో ఎసిబి తొలిసారి అతి ఖరీదైన అవినీతి తిమిం గలాన్ని పట్టుకొంది. రెడ్కోకో డీఈగా పనిచేస్తున్న వెంకటరమణ నివాసాలలో ఎసిబి అధికారులు బుధవారం సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఆయనతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. తనిఖీల సమయంలో వెంకటరమణ భారీ గా అక్రమాస్తులు సంపాదిం చినట్లు గుర్తించారు.

7 ప్రాంతాల్లో ఏకకాల దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కేజీల బంగారం, బ్యాంకు బ్యాలెన్స్‌లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య పేరిట పలు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు, అనేక భవ నాలు, ప్లాట్లు ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఆస్తుల విలువ రూ.400 కోట్లకు పైగా ఉంటుందని ఎసిబి అధికారులు తాజాగా అంచనా వేశారు. బుధవారం రెడ్కో డిఇ ముత్యం వెంక ట రమణను అరెస్టు చేసిన ఎసిబి అధికారులు గురువారం ఉదయం నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చారు.

న్యాయమూర్తి అతడికి 14 రోజుల పాటు రిమాండ్ విధిం చారు. దీంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. . ఎస్‌పీడీసీఎల్‌లో పని చేస్తున్నప్పుడు 2019లో రూ.25,000 లంచం తీసుకుంటూ రమణ గతం లో రెడ్-హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆ కేసు ఇంకా విచారణ దశలోనే ఉండగా, తాజాగా ఎసిబి జరిపిన దాడు ల్లో రూ.28. 14 కోట్ల (రిజిస్ట్రేషన్ విలు వ ప్రకారం) అక్రమ ఆస్తులు బయట పడ్డాయి. ఇది గతంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీకి సంబంధించి నమో దైన రూ.17.94 కోట్ల రికా ర్డును అధిగమిం చింది. కాగా డిఇ ఆస్తులు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం రూ.400 కోట్లకు పైగా ఉంటాయనేది తాజా ఎసిబి అధికారుల అంచనాగా ఉంది.